
యాదాద్రి భువనగిరి: కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను గవర్నర్ పరిశీలంచారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. యాదాద్రి ఆలయం మహోన్నతంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయ పునర్ నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయి. మానవ నిర్మిత మహాకట్టడంగా యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోతుంది. గర్భగుడి ఆలయం కూడా చాలా దివ్యంగా రూపుదిద్దుకుంటోంది.