అమిషాతో ముగిసిన గవర్నర్ నరసింహన్ భేటీ

Mon,June 10, 2019 02:05 PM

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ... మర్యాదపూర్వకంగా హోంమంత్రి అమిత్‌షాను కలిశానని తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లోని పరిస్థితులను వివరించానన్నారు. తెలుగు రాష్ర్టాలు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నాయి. పెండింగ్‌లోని విభజన సమస్యలు పరిష్కారం అవుతాయి. తొలుత హైదరాబాద్ భవనాల సమస్యను పరిష్కరించాం. రెండు రాష్ర్టాల మధ్య అన్ని సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.

1711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles