అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి...

Fri,August 2, 2019 01:18 PM

హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్-1 శిక్షణ అధికారుల వీడ్కోలు సమావేశం జరిగింది. ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లు, అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్లు, మిగితా విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెల రోజులపాటు శిక్షణ అందజేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రూప్ - 1 అధికారులు క్షేత్రస్థాయి పర్యటన అధికం చేయాలని సూచించారు. ప్రజలుకు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వ నిధులు, ఖర్చులకు సంబంధించిన పనులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles