ప్లాస్టిక్ వాడకం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు

Wed,June 13, 2018 05:57 PM

Government take actions towards reducing plastic consumption

హైదరాబాద్: ప్లాస్టిక్ వాడకం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని కార్పొరేషన్లు, పురపాలికల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని విభాగాల అధిపతులకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ లేఖ రాశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఈ లేఖ రాశారు. 50 మైక్రాన్లకు తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, స్ట్రాలు వినియోగించవద్దన్నారు. ప్రతి కార్యాలయంలో విధిగా రెండు చెత్త డబ్బాల వాడకం అమలు చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ పూర్తి స్థాయిలో అవగాహనా చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించే చర్యలకు సంబంధించిన ఫోటోలను వాట్సప్ గ్రూప్‌లో పెట్టాలని ఆయన సూచించారు.

1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles