జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు: కేటీఆర్Tue,November 14, 2017 06:57 PM

జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు: కేటీఆర్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, కార్పోరేటర్ విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర ఏర్పాటుకు ముందు జలమండలి కార్యాలయం ఎదుట ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగూణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఉండకూడదని సీఎం కేసీఆర్ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. లక్షా 50 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేస్తున్నాం. ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

1126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS