నలుగురు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు

Sat,June 1, 2019 02:59 PM

government hospital staff suspended in bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం: భద్రచలం ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వైద్యులు, ఒక సహాయకుడిపై వేటు పడింది. వీరిని సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కమిషనర్ అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ప్రాక్టిస్ చేస్తున్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో వైద్యులపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవరాజ్, రామకృష్ణలపై చర్యలు తీసుకున్నారు. అత్యవసర విభాగం ఇన్‌ఛార్జిగా ఉన్న రమేశ్ చంద్రపై లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. నూతన సూపరింటెండెంట్‌గా కోటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి నూతన సిబ్బంది విధులకు హాజరుకానున్నారు.

3176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles