రవాణా ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

Thu,October 10, 2019 06:41 PM

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. గురువారం 8150 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో 3013 ఆర్టీసీ, 1804 అద్దె, 696 ప్రైవేట్, 2637 మాక్సీ క్యాబ్‌లు నడుస్తున్నాయన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ వినతి మేరకు మెట్రో రైలు అదనపు ట్రిప్పులను నడుపుతోందన్నారు. ప్రైవేట్ వాహనాలను స్టేజ్ క్యారియర్లుగా నడిపేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. మరిన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని ఓలా, ఉబర్‌లను కోరామన్నారు. సెట్విన్ బస్సుల ట్రిప్పులను పెంచామన్నారు. తెలంగాణకు అదనపు బస్సులు నడపాలని ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఆర్టీసీలను కోరినట్లు వెల్లడించారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles