ప్రతి ఎకరాకు సాగునీరే ప్రభుత్వ లక్ష్యం: నిరంజన్‌రెడ్డిTue,February 13, 2018 09:19 PM
ప్రతి ఎకరాకు సాగునీరే ప్రభుత్వ లక్ష్యం: నిరంజన్‌రెడ్డి

ఖిల్లాఘణపురం : వచ్చే వానాకాలం నాటికి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎంజీకేఎల్‌ఐ 29వ ప్యాకేజీ నుంచి ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్‌తో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని గణపసముద్రం చెరువుకు వచ్చిన సాగునీటిని నిరంజన్‌రెడ్డి ఉమ్మడి జిల్లా కవులు, రచయితలతో కలిసి పరిశీలించారు. అనంతరం గణపసముద్రం తూము వద్ద నిరంజన్‌రెడ్డి పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలకు అప్పులు, కన్నీళ్లు, ఆకలి చావులు మాత్రమే మిగిలాయన్నారు. ఒక వైపు కరువు కరాళ నృత్యం చేస్తుండగా, మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత పాలకవర్గం నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో పసిడి పంటలు పండే భూములు భీళ్లుగా మారాయి. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ కృషితో బీడు భూములు సాగులోకి వస్తున్నాయన్నారు.

వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సాగు నీరందని 25 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలంలోని మామిడిమాడలోని నేరెడు చెరువు, ఎర్రకుంటలను రిజర్వాయర్లుగా మార్చి, ఖిల్లాఘణపురంలోని గణపసముద్రం చెరువుకు సాగునీరు అందిస్తామన్నారు. పది రోజుల్లో గణపసముద్రం అలుగుపారుతుందన్నారు. 60 ఏళ్ల చరిత్రలో గణపసముద్రం చెరువు అలుగు పారటం కేవలం ఇది మూడో సారి అని ఆయన గుర్తుచేశారు.
అనంతరం కవులు, రచయితలు మాట్లాడుతూ పేదరికం, వలసలకు నిలయంగా ఉన్న మండలాన్ని నిరంజన్‌రెడ్డి సస్యశ్యామలం చేశారని, వలస వెళ్లిన వారు కూడా గ్రామాలకు చేరుకుని బీడు భూములను సాగు చేసుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు.

500
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018