బాసర అమ్మవారిని దర్శింకున్న ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్..

Sun,November 17, 2019 04:56 PM

బాసర: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. అతని భార్యా పిల్లలతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రభుత్వ చీఫ్ విప్ కూతురు రిషిక, కుమారుడు కృష్ణలకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జీవితంలో మరిచిపోలేని రోజని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ నిత్య అన్నదాన సత్రంకు 51వేల రూపాయలు, అభిషేకానికి 51 వేల రూపాయలు, శాశ్వత కుంకుమార్చన పూజకు 14వేల రూపాయలు వినయ్ భాస్కర్ దంపతులు అర్చకులకు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles