గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం

Fri,September 9, 2016 01:24 PM

Goreti Venkanna award

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కాళోజీ నారాయణరావు 102వ జయంతి సందర్భంగా ప్రభుత్వం వెంకన్నను కాళోజీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. పురస్కారం అందుకున్న సందర్భంగా వెంకన్న తన తల్లికి పాదాభివందనం చేశారు. వెంకన్నను మంత్రులు కొనియాడారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారి, సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్‌తో పాటు పలువురు హాజరయ్యారు.

పల్లె పాటకు పట్టం
పల్లె కన్నీరు పెడుతుంతో.. కనిపించని కుట్రలా.. పల్లెపల్లెన పల్లెర్లు మొలిచే పాలమూరులోన.. మన తెలంగాణలోన.. అంటూ జిల్లాలోని పల్లెల గోసను కళ్లకు కట్టేలా వర్ణించిన తీరు.. అద్భుతం..!
మందెంట వోతుండే ఎలమంద.. వాడు ఎవ్వని కొడుకమ్మ ఎలమంద.. చూస్తే చిన్నపోరగాడు ఎలమంద.. వాడు తెలంగాణ జెండా పట్టె ఎలమంద అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల దాక పాలుపంచుకునేలా చేసిన ఆ పాట..!
గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. వాళ్లు ఉన్న ఇల్లు కిల్లీ కొట్టుకన్నా చిన్నది.. అంటూ పేదల బతుకు దృశ్యాలను వినిపించిన తీరు..!
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత అయినా తక్కువే.. మన పాలమూరు ముద్దు బిడ్డ గోరటి వెంకన్న కాళోజి పురస్కారం అందుకున్న సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఎంకన్న మాట్లాడొద్దు.. పాడాలే... ఆడాలే.. మాకందరికీ ఆ ఆటా పాటే కావాలె.. అని ఈలలు, గోలల మధ్య ప్రేక్షకులు చేసే లొల్లి.. ఎంకన్న మైకు పీస్ చేతికందుకోగానే ఒక్కసారిగా నిశ్శబ్దం. ఇది ఏ ఒ క్క కార్యక్రమంలోనూ కాదు.. ఆయన పాల్గొనే చి న్న కార్యక్రమమైనా, పెద్ద కార్యక్రమమైనా ఇదే తతంగం. ఏదోపాట ఆరంభిస్తాడు.. అంతలోనే గంతులేస్తాడు.. పాట ఎక్కడికో వెళ్తుందనుకుంటా రు అందరు, కానీ ఎక్కడికి వెళ్లదు. ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒకసారి, ఆలోచింపజేసేలా మరోసారి, గిలిగింతలు పెట్టేలా, బొంగురు పోయి న కోయిలపాటలా.. పారే సెలయేరులా.. సాగుతుంది ఎంకన్న పాట. పాలమూరు జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ర్టానికి యావత్ ప్రపంచంలో గుర్తింపును తీసుకొచ్చిన తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ ఆయన. ఎంకన్న అంటే ఆటపాటే కాదు, మ న తెలంగాణ భాషకు ఊపిరిపోస్తూ ఆ భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు. అందుకే ఆయనకు మన తెలంగాణ భాషా దినం సం దర్భంగా మన కాళన్న పురస్కారాన్ని రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. అభినందనలు, పురస్కారాల వెనుక ఎంకన్న శ్రమనే కాదు, ఆయన తల్లిదండ్రులు, ఆయన పుట్టి పెరిగిన తెలకపల్లి మండలం గౌరారం గ్రామ ప్రజలు, చుట్టూ ఉండే చెట్టూ, చేమ, పుట్టా, గుట్ట లు ఉన్నాయి. అందుకే ఆయన నేను ఎదగలేదు, నా తల్లిదండ్రులు నా ఊరు చుట్టూ ఉన్న పరిసరాలు, స్నేహ బాంధవ్యాలు నన్న ఇంతటోడ్ని జేసినయంటడు. అందుకే ఆయన కళామతల్లి ముద్దుబిడ్డడయ్యిండు..!

1963లో తెల్కపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో నరసింహ, ఈరమ్మ దంపతుల పెద్ద కుమారుడిగా జన్మించిన ఎంకన్నకు చిన్నప్పటి నుంచే ఆటా, పాటలపై మోజు ఎక్కువ. తన తల్లిదండ్రులు చదువులేని సహజ పండితులుగా పలు పురాణాలు, యక్షగానాలను ఒంట బట్టించుకొని పాడే భక్తి బాటలు, మంగళహారతి పాటలు ఆయనలో ఓ రకమైన ఆసక్తిని పెంపొందించాయి. గ్రామంలో చదువుకునే రోజుల్లో ఓ ముస్లిం అధ్యాపకుడు చెప్పిన తెలుగు పాఠాలతో తనలో ఉన్నపాటలకు, మాటలకు శ్రీకారం చుట్టాడు. చిన్నప్పటి నుంచే పాటలు, ఆటలతో అలరించే ఎంకన్న 1984లో రాసిన నీ పాట ఏమాయోరో.. నీ మా ట ఏమాయోరో అన్న పాటలు రాసి అప్పట్లో క మ్యూనిస్టు భావాలున్న గ్రామ పెద్ద వెంకట్‌రెడ్డి మాస్టరు అభినందనలను అందుకున్నాడు. ఇక నుంచి ఆయనను తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రజాసామ్య వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఆయన రాసిన పాటలు, మాటలు తుపాకీ తూటల్లా పేలేవి.

అప్పటి వరకు కమ్యూనిస్టు భావాలతో కూడిన సాహిత్యానికి భక్తిభావాలకు పరిమితమైన ఎంకన్న 1995లో తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి రేలా దూలా తాలెల్లాడే నేలా నా తెలంగాణ సుడిగాలికి చెరిగిన పక్షులాయే అంటూ రచించి ఆలపించిన పాట, గుండెగుండెను తట్టి లేపింది. అప్పటి వరకు గ్రా మాల్లో ఒక వెలుగు వెలిగిన కులవృత్తులు కనుమరుగు కావడంతో పల్లె కన్నీరు పెడుతుంతో.. కనిపించని కుట్రలా.. అని ఆవేదన పూరితంగా రచించిన పాట హృదయం ఉన్న ప్రతి ఒక్కరిలో కన్నీటిని పెట్టించింది. పరుగు పరుగున వచ్చినాడు.. పట్నోంలా వాలినారు. గుమ్మాలకు బొమ్మలోల్లె గుడ్లు ఎల్లబెట్టినారు. ఏ ఆఫీసు మెట్లెక్కినా జిల్లెలమ్మ జిట్ట అంటూ తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలను పొందిన ఆంధ్రోళ్లను గురించి రాసిన పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.

పాలమూరు జిల్లాలో 297 కి.మీ. ప్రవహించే కృష్ణమ్మ గురించి ఎంత సక్కని దానవే కృష్ణమ్మ, ఎటు దిక్కు పోతున్నావే.. మిరప సేల గొంతు మురిపెంగ తడిపేవు.. పొగాకు ఎమ్మకు పొగరును పెంచేవు. మాకెల్ల జొన్న సేనుకు కృష్ణమ్మ తెడ్డు జూపి పోతివా అంటూ నిలదీశాడు. మందెంట వోతుందే ఎలమంద.. వాడు ఎవ్వని కొడుకమ్మ ఎలమంద.. చూస్తే చిన్నపోరగాడు ఎలమంద.. వాడు తెలంగాణ జెండా పట్టె ఎలమంద అంటూ తెలంగాణ ఉద్యమంలో పిల్లలంతా జై కొడుతున్నప్పుడు రాసిన ఈ పాట పిల్లల్నే కాదు.. పెద్దల్ని సైతం ఉద్యమంలోకి రావడానికి కారణమైంది. గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. వాళ్లు ఉన్న ఇల్లు కిల్లీ కొట్టుకన్నా చిన్నదున్నదో గల్లీ చిన్నది అంటూ పేదల బతుకు దృశ్యాలను వినిపించిన తీ రు అటు పండింతులు, ఇటు పామరులను ఆకట్టుకుంది. అన్నింటికీ మించి దేశంలోనే కాకుండా ప్ర పంచవ్యాప్తంగా పాలమూరు ప్రజల బతుకు బాధలను తెలియజేసే పల్లెపల్లెన పల్లెర్లు మొలిచే పాలమూరులోన.. నా తెలంగాణలోన.. అంటూ ఆలపించిన పాట గుండె గుండెను పిండేసింది. తెలుగు మాట్లాడేటోల్లందరికీ పాలమూరు ప్రజల కష్టాలు, కన్నీళ్ల బా ధలను తెలిపింది. సంతా. మా ఊరి సంత.. వారానికి ఒకసారి జోరుగా సాగేమంతా మా ఊరి సంత అంటూ ఆలపించిన గేయం చిరువ్యాపారుల బతుకులను ఆవిష్కరింజేసింది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నప్పు డు ఉద్యమకారులకు ఉత్తేజాన్ని ఇవ్వడంతోపాటు అందరినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేసేందుకు ఆయన ఆడిన ఆ ట, పాడిన పాట ఎంతగానో తోడ్పడ్డా యి. మరో వైపు సినిమా గేయ రచయితగా, టీవీలలో జానపద గేయాలకు సంబంధించి ప్రసారమవుతున్న కార్యకమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించడంతోపాటు పాడే పాటలు, ఆడే ఆటలు కళాకారులకే కాకుండా సాధారణ జనానికి కూడా ఆసక్తిని రేపుతున్నాయి. బతుకమ్మ, శ్రీరాములయ్యతోపాటు అనేక సినిమాల్లో నటుడిగాను కనిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన ఆనందాలను వెంకన్న పంచుకున్న తీరు బందూ క్ సినిమాలో పొందుపర్చిన ఊపిరి సల్పని పాట రూపంలో మన అందరినీ ఆకట్టుకుంది.

పూసిన పున్న మి వె న్నెలమేనా తెలంగాణ మేనా.. అంటూ తెలంగాణ పదజాలంతో రూపొందిన ఈ పాటకు యావత్ తెలంగాణ ప్రజానీకం దాసోహమంటూ ఎంకన్నకు అభినందన హారాలను సమర్పించుకున్నారు. ఇలా తాను ఏం మాట్లాడినా.. పాడినా.. కథ చెప్పినా వాటిలో తెలంగాణ భాషే ఉంటుం ది. తెలంగాణ భాష పరిరక్షణ కోసం కాళన్న రచనలు చేస్తే ఎంకన్న మాత్రం ఆ భాషకు మరింత వన్నె తెచ్చేలా ప్రదర్శించే ప్రతి కార్యక్రమం అ మోఘం. అందుకే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కా ళన్న పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా పాలమూరుజిల్లా ప్రజలు, సాహితీ వేత్తలు హర్షాతిరేఖాలను వ్యక్తం చేస్తున్నారు.

4472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS