
సూర్యాపేట: మత్స్యకారులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సామాగ్రిని అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత అభివృద్ధి పథకం కింద అర్హులైన 933 మంది లబ్దిదారులకు రూ. 3. 55 కోట్ల విలువైన సామాగ్రిని అందించారు. ద్విచక్ర వాహనాలు, సామాగ్రిని మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.