నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

Wed,August 14, 2019 01:39 PM

Good work done by Auto driver in Hyderabad

హైదరాబాద్‌ : నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మరిచిపోయిన ల్యాప్‌టాప్‌, రూ. 10 వేల నగదును తిరిగి పోలీసులకు అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 258 వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. ఆటోను కిరాయి తీసుకున్నాడు. అయితే ఇంజినీర్‌ బెంగళూరు వెళ్లాల్సి ఉంది. దీంతో బెంగళూరుకు వెళ్లే బస్సును క్యాచ్‌ చేయాలని ఆటో డ్రైవర్‌కు సూచించాడు. ఈ క్రమంలో బస్సు వద్దకు వెళ్లగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆందోళనకు గురవుతూ.. ఆటోలో ఉన్న ల్యాప్‌టాప్‌, నగదును మరిచిపోయాడు. తాను ల్యాప్‌టాప్‌, నగదు మరిచిపోయానని తెలుసుకున్న సదరు ఇంజినీర్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తన ఆటోలో ల్యాప్‌టాప్‌ బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్‌ రాజ్‌ కుమార్‌(32) ఇవాళ ఉదయం నేరుగా రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ బ్యాగును అప్పజెప్పాడు. ల్యాప్‌టాప్‌, నగదును సదరు ఇంజినీర్‌కు పోలీసులు అప్పగించారు. మొత్తానికి ఆటో డ్రైవర్‌ నిజాయితీని పోలీసులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మెచ్చుకుని అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

1347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles