యాదాద్రీశుడికి రూ. 25లక్షలతో బంగారు రథం

Fri,July 19, 2019 09:07 PM

golden ratham to yadagiri lakshmi narasimha swamy

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన ఇల్లూరు గోపాలకృష్ణమూర్తి అనే భక్తుడు రూ. 25, 00, 000 విలువైన బంగారంతో బంగారు రథాన్ని తయారు చేయించడానికి ముందుకు వచ్చారు. కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త గోపాలకృష్ణమూర్తి ఇప్పటికే రాయ్‌చూర్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి బంగారు రథాన్ని తయారు చేయించగా దాన్ని పరిశీలించాల్సిందిగా ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలను ఆహ్వానించారు. శుక్రవారం రాయ్‌చూర్ వెళ్లి వారు పరిశీలించారు. ఇదే నమూనాలో ఉన్న బంగారు రథాన్ని యాదాద్రీశునికి కూడా తయారు చేయించి ఇస్తానని గోపాలకృష్ణమూర్తి ఆలయ ఈవోకు చెప్పడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కోసం ఇప్పటికే రథం తయారు చేయించామని దానికి బంగారు తాపడం చేయిస్తే బాగుంటుందని ఈవో గీత ఆయనకు తెలియపర్చారు. అందుకు ఆయన సమ్మతించి తప్పకుండా మీరు కోరినట్లుగానే బంగారు రథాన్ని తయారు చేయించి శ్రీవారికి సమర్పిస్తామని హామీ ఇచ్చారని ఈవో చెప్పారు. దేవాదాయ శాఖ కమీషనర్‌కు ఇతర అధికారులకు బంగారు రథం భక్తుడు తయారు చేయించి సమర్పించనున్న విషయాన్ని తెలియపరుస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో దోర్భల భాస్కరశర్మ తదితరులు పాల్గొన్నారు.

754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles