పోచారం హయాంలో రైతాంగానికి స్వర్ణయుగం: హరీశ్‌రావు

Fri,January 18, 2019 12:40 PM

హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి గడిచిన నాలుగున్నరేళ్లు ఒక స్వర్ణయుగమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. పోచారం సభాపతిగా శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎంపికపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు రెండో సభాపతిగా ఎన్నికైనందుకు మీకు మా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో ఒక ఉద్యమకారుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి జైళ్ల పడి.. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ఉపఎన్నికలో గెలిచి ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఈ తెలంగాణ శాసనసభలో మీరు సభాపతిగా ఆ కూర్చిలో కూర్చొవడం అంటే ఇది మీకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.


పని విషయంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో నేర్చుకునేవాళ్లం. 69 ఏండ్ల వయస్సులో కూడా 29 ఏండ్ల యువకుడిలా పనిచేసేవారు. అపార అనుభవం కలిగిన వ్యక్తి, డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అధికార- ప్రతిపక్ష శాసనసభ్యుడిగా వివిధ మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవం కలిగిన మంత్రిగా, మిమ్మల్ని మన సభానాయకులు కేసీఆర్‌గారు సభాపతిగా ఎంపిక చేయడం సరైన వ్యక్తికి సమున్నత గౌరవం లభించినట్లుగా భావిస్తున్నాం. ఇందుకు సభానాయకుడికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.

తెలంగాణ రైతాంగానికి గడిచిన నాలుగున్నరేళ్లు ఒక స్వర్ణయుగం. గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలిగాం. మీ పనితీరు, సీఎం నిర్ణయాలతో స్వామినాథన్ లాంటి వ్యవసాయరంగ నిపుణుడే అవార్డు ఇచ్చి రైతాంగానికి చేస్తున్న మేలును గుర్తించారు. కారే కార్యాలయంగా ఉండేది. రైతు బంధు అడిగినా, ఇన్సూరెన్స్ అడిగినా, రైతు సమన్వయ సమితులు అడిగినా వేళ్లమీద ప్రతి సమాచారం చెప్పేవారు. ప్రజలకు సేవ చేసే ఒక దృక్పథంతో సీఎం చెప్పిన నిర్ణయాలను అమలు చేయాలనే ఒక పట్టుదలతో, నిబద్దతతో పనిచేసిన నాయకులు మీరు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విషయంలో మీ కృషి చాలా అభినందనీయం. నిజాంసాగర్ రైతుల కోసం మీరు పడిన తపన.. సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో, నిజాంసాగర్ ఆధునీకరణ విషయంలో మీ కృషి ఆమోఘం. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజాంసాగర్ అనుసంధానం చేయాలని సీఎంతో ఒప్పించి మెప్పించుకున్న తీరు రైతులపట్ల మీ ప్రేమను తెలియజేస్తుంది. వ్యవసాయశాఖకు మంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా పనిచేశారు. అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఈ సభను అత్యంత హుందాగా భారతదేశంలోని మిగతా శాసనసభలకు ఆదర్శవంతమైనటువంటి సభగా తీర్చుదిద్దుతారన్న నమ్మకం తనకుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

1674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles