ఏడు వారాల నగల గురించి తెలుసా?

Sun,December 20, 2015 10:54 AM

gold wear a woman in seven days

పూర్వకాలం ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉండేది. అవి ఉంటే ధన, కనక ఐష్టెశ్వర్యాలు కలుగుతాయిని నమ్మకం. కొంతమందయితే కుటుంబ యజమానితో పోరుపెట్టి మరీ ఏడు వారాల నగలు సాధించుకునేవారు. ఆ నగలను ఒక్కోటి ఒక్కోరోజు వారం పాటు వేసుకునేవారు. ఇంతకీ ఏ రోజు ఏ నగ వేసుకుంటారో, దేని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఆదివారం : సూర్యుని అనుగ్రహం కోసం కెంపుల కమ్మలు, హారాలు, గాజులు

సోమవారం : చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాలహారాలు, గాజులు

మంగళవారం : కుజుని కోసము పగడాలద దండలు, కమ్మలు, గాజులు మొదలగునవి

బుధవారం : బుధుని కోసము పచ్చల పతకాలు, కమ్మలు, గాజులు

గురువారం : బృహస్పతి కోసం పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు మొదలైనవి.

శుక్రవారం : శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక, వజ్రాల గాజులు ఇతర ఆభరణాలు.

శనివారము : శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణిహారము, గాజులు మొదలైన ఆభరణాలు ధరిస్తారు.

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS