చదువులో గోల్డ్ మెడలిస్ట్... చోరీల్లో కేటుగాడు

Thu,March 21, 2019 08:03 AM

Gold Medalist in Education but thief in life

హైదరాబాద్ : ఉన్నత చదువు చదివిన ఓ వ్యక్తి విలాసాలకు అలవాటుపడి దొంగతనాల బాటపట్టాడు. కార్లలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా... 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ... మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...
ప్రకాశం జిల్లా వెటపాలెం ప్రాంతానికి చెందిన మిక్కిలి వంశీ కృష్ణ అలియాస్ లోకేశ్ అలియాస్ రిచర్డ్ ఎంబీఏ చదివాడు. చన్నై తంగవేలు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఉన్నత చదువులు చదివిన వంశీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి... 2006 నుంచి నేరాల బాట పట్టాడు. కారులో సంపన్నులు నివసించే కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో వంశీ పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కి 59 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. పీడీ యాక్ట్ శిక్షను కూడా అనుభవించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. 2018 అగస్టులో జైలు నుంచి విడుదలై... తిరిగి వరుస చోరీలకు పాల్పడ్డాడు.

తాజాగా... మరో 10 చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు మిక్కిలి వంశీకృష్ణ కోసం గాలించి బుధవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి 800 గ్రాముల బంగారం. లక్షన్నర నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణ కుటుంబం ఉన్నత స్థానంలో ఉండడంతో.. నిందితుడు వంశీ కృష్ణ వారికి దూరంగా ఉంటున్నాడు. చోరీ చేసిన సొత్తుతో స్టార్ హోటళ్లలో బస చేయడం, విహారయాత్రలు తిరగడం చేస్తుంటాడని తెలిసింది. చోరీ చేసిన బంగారాన్ని నగదు కిందకు మార్చుకునేందుకు అతను చోరీ సొత్తును ముత్తూట్, ఐఐఎఫ్‌ఎల్, మణ్ణపురం ఫైనాన్స్ సంస్థలో గిరివి పెట్టాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు వంశీకృష్ణ బెంగళూరులో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

2120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles