యాదాద్రీశునికి బంగారు హారం బహూకరణ

Mon,June 17, 2019 09:51 PM

gold haram gift to yadadri lakshmi narasimha swamy

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి సికింద్రాబాద్‌కు చెందిన ఉప్పు మనోహర్ రేణుక దంపతులు రూ. 11 లక్షల విలువచేసే 336 గ్రాముల బంగారంతో తయారు చేసిన దశావతారాల హరాన్ని బహుకరించి తమ మొక్కును తీర్చుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉప్పు మనోహర్ తన కోర్కెలు నెరవేరడంతో తమ మొక్కులను శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి తీర్చుకున్నారు. యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీతకు హారాన్ని అందజేయగా ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకబృందంతో సంప్రోక్షణ పూజలు నిర్వహించిన మీదట శ్రీవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతు యాదాద్రిని సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయంగా నిర్మాణం చేస్తున్న తరుణంలో శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మనోహర్ కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం కలిగించిన మీదట ఆశీర్వచనం జరిపి శ్రీవారి ప్రసాదం అందజేశారు.

2037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles