త్వరలోనే హుస్నాబాద్‌కు గోదావరి జలాలు

Tue,November 19, 2019 09:39 PM

సిద్దిపేట : ఇన్నాళ్లూ అరకొర విద్యుత్ సరఫరా, సరిపడని విద్యుత్ సబ్‌స్టేషన్లతో చీకట్లో మగ్గుతున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో వెలుగులు నిండాయని, సిద్దిపేట జిల్లాలో విలీనమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో సబ్‌స్టేషన్లు, పలు అభివృద్ధి పనులు బ్రహ్మండంగా చేసుకుంటున్నామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, హుస్నాబాద్ మండలాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్లను,కోహెడలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.


అనంతరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు 21 ట్రాక్టర్లను గ్రామపంచాయతీలకు అందించారు. ఆయా సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని,త్వరలో ఈ ప్రాంతానికి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు అందనున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళిక చేపట్టడంతో గ్రామాల్లో ఉన్న 70 ఏళ్ల దరిద్రాన్ని 30 రోజుల్లో పొగొట్టామని ప్రతి గ్రామపంచాయతీలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ టీమ్ వర్క్‌గా పనిచేసి గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.

సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారన్నారు. ఆ నీటిని మనం పొదుపుగా వాడుకోవాలన్నారు. తాగునీటి వృథాను అరికట్టాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు.దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని రైతాంగానికి మంత్రి సూచించారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles