దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం 73.40 మీటర్లు

Fri,July 12, 2019 09:31 PM

godavari water level at devadula project is 73 meters

తుపాకులగూడెం బ్యారేజీ వద్ద తగ్గిన ప్రవాహం
ఇన్‌టేక్‌వెల్ వద్ద పంపింగ్‌లో మూడు మోటర్లు

ములుగు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వరదతో గోదావరి ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద శుక్రవారం గోదావరి నీటి మట్టం 73.40 మీటర్లకు చేరుకుంది. గత రెండు రోజులుగా గోదావరి వరద తగ్గుముఖం పడుతోంది. ఇక్కడ 72 మీటర్ల గోదావరి ప్రవాహం ఉంటే ఇన్‌టేక్ వెల్‌లోని మోటర్లు నడిచే అవకాశం ఉంది. ఇన్‌టేక్ వెల్ నుంచి నీటి పంపింగ్ కొనసాగుతోంది. మూడు మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.

ఇన్‌టేక్ వెల్‌లోని మొదటి దశలో ఒకటి, రెండవ దశలో ఒకటి, మూడవ దశలో ఒక మోటరు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దేవాదుల కింది భాగంలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ వద్ద కూడా గోదావరి ప్రవాహం తగ్గుతోంది. దీంతో గోదావరిలో ఉన్న పియర్స్ బయటపడుతున్నాయి. మరి కొంత తగ్గితే ఇక్కడ పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇక్కడ నెలకొన్న పరిస్థితిని శుక్రవారం ఈఈ జగదీశ్ పరిశీలించారు. ఇదిలా ఉండగా మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌కు దూరంగా గోదావరి ప్రవహిస్తోంది.

1479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles