ఏడాదిలోగా సిద్దిపేటకు గోదావరి నీళ్లు: హరీశ్‌రావు

Fri,March 22, 2019 10:00 PM

Godavari river water to Siddipet within a year says Harish rao

సిద్దిపేట: ఏడాదిలోగా సిద్దిపేటకు గోదావరి నీళ్లు వస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌లో మెదక్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ అభివృద్ధి రథం పరుగెత్తాలంటే టీఆర్‌ఎస్ గెలవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ విజయం సాధించాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో తమకు పోటీ లేదని.. తమకు తామే పోటీ అని అన్నారు. అత్యధిక మెజార్టీతో మెదక్ అభ్యర్థి గెలుస్తారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పేర్కొన్నారు.

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles