భద్రాచలం వద్ద 30.4 అడుగులకు చేరిన గోదావరి

Wed,July 11, 2018 10:43 PM

godavari river water level reached to 30.4 feets at bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో కురుస్తోన్న వర్షాల కారణంగా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగడం, చెరువులు మత్తడి పోయడంతో వరద నీరంతా గోదావరికి చేరడంతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. బుధవారం భధ్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30.4 అడుగులకు చేరింది. మంగళవారం 26.5 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు అడుగులు పెరిగింది.

మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరికి వరదనీరు ఉదృతంగా వస్తోంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13.5 అడుగులకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తి 1900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం తాలిపేరు నీటి మట్టం 72.70 మీటర్లు. తాలిపేరు వరద నీరంతా గోదావరిలో కలుస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం 399.2 అడుగుల వద్ద నిలకడగా ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles