పెన్‌పహాడ్‌కు చేరుకున్న గోదావరి జలాలు

Thu,October 11, 2018 04:50 PM

Godavari river water comes to Penpahad

సూర్యాపేట: గోదావరి నది జలాలు సూర్యాపేట నియోజకవర్గం పెన్‌పహాడ్‌కు చేరుకున్నాయి. గంగమ్మ రాకను ఆహ్వానిస్తూ రైతన్నలు గోదారమ్మకు పూజలు నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషివల్లే ఇది సాధ్యమైందని అన్నదాతలు పేర్కొంటూ సూర్యాపేట రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల కల ఇవాళ నెరవేరిందన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని.. ఈసారి ప్రజలు కాంగ్రెస్‌ను శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తారని మంత్రి పేర్కొన్నారు.

2196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles