ఒకే ఈతలో ఆరు పిల్లలకు జన్మనిచ్చిన మేక

Mon,November 11, 2019 07:41 AM

వికారాబాద్ : జిల్లాలోని దౌల్తాబాద్ మండంల సుల్తాన్‌పూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఓ మేక ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. బోయిని మాణిక్యప్పకు చెందిన మేక ఆరు పిల్లలకు జన్మనివ్వగా, అందులో ఒకటి సాయంత్రం మృతి చెందింది. సాధారణంగా మేకలు ఒక ఈతలో ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ ఈ మేక ఒకేసారి ఆరు పిల్లలకు జన్మనివ్వడంతో వాటిని చూసేందుకు గ్రామస్తులు మాణిక్యప్ప ఇంటికి తరలివచ్చి ఆసక్తిగా చూశారు.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles