ప్రైవేటు స్కూల్ ఫీజులపై త్వరలో జీవో

Wed,December 21, 2016 01:31 AM

GO will soon be on the private school fees

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో అధిక ట్యూషన్ ఫీజులను నియంత్రించే అంశంపై పాఠశాల విద్యా శాఖ చర్యలు వేగవంతం చేసింది. విధి విధానాలతో వీలైనంత త్వరలోనే ఫీజుల నియంత్రణపై జీవో విడుదల చేయనున్నారు.

అందుకు సంబంధించిన ముసాయిదా జీవో కూడా సిద్ధం చేశారు. అయితే తెలంగాణ ప్రైవేటు రికగ్నైజ్డ్ స్కూల్ మెనేజ్‌మెంట్ (ట్రస్మా) రాష్ట్ర నాయకులు ట్యూషన్ ఫీజులపై సీలింగ్ విధించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠం రూ.40 వేల వరకు ఫీజులు వసూలు చేసుకోవడానికి ఎలాంటి షరతులు విధించవద్దని కోరారు. ఈ మేరకు స్కూళ్లను గుర్తించి ఆ మేరకు ఆడిట్ నివేదికలు అడుగవద్దని విజ్ఞప్తి చేస్తూ.. మంగళవారం వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం కడియంను కలిసిన వారిలో ట్రస్మా రాష్ట్ర నాయకులు ఎస్‌ఎన్‌రెడ్డి, రామ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో విద్యా శాఖ డైరెక్టర్ జీ కిషన్ కూడా ట్రస్మా నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.

2059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles