వేధింపులపై సమాచారం ఇవ్వండి...

Sat,March 30, 2019 07:51 AM

Give information to SHE Team on harassment

హైదరాబాద్ : మహిళలు, యువకులు, విద్యార్థినులను వెంటపడి, వేధింపులకు గురిచేస్తే జైలు శిక్ష తప్పదని నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖా గోయెల్ హెచ్చరించారు. మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వెంటపడుతున్నా వెంటనే బాధితులు షీ టీమ్స్‌కు సమాచారం అందిస్తే, వారు తగు చర్యలు తీసుకుంటారన్నారు.
మార్చిలో హైదరాబాద్ షీ టీమ్స్‌కు వేధింపులపై 113 ఫిర్యాదులు అందాయని శిఖా గోయెల్ తెలిపారు. నేరుగా 60, వాట్సాప్ ద్వారా 43, ఈ-మెయిల్ ద్వారా 6, హాక్ ఐ ద్వారా 3, సీనియర్ అధికారుల ద్వారా ఒక ఫిర్యాదు చొప్పున వచ్చాయని వివరించారు. ఇందులో 12 మందకి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించగా, ఆరుగురిపై 9 కేసులు నమోదు చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు సిఫారస్ చేసినట్లు తెలిపారు. వేధింపులపై మౌ నంగా ఉండవద్దని డయల్ 100కు ఫోన్ చేయాలని, హైదరాబాద్ వాట్సాప్ 9490616555కు సమాచారం ఇవ్వాలని అదనపు సీపీ సూచించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడంతో ఆయా కేసుల్లో వారికి న్యాయస్థానాలు శిక్షలు ఖరారు చేస్తున్నాయని ఆమె వివరించారు. ఫోన్, సోషల్‌మీడియా ద్వారా వేధించేవారిపై తప్పని సరిగా జైలు శిక్షలు పడుతున్నాయని, ఎవరు కూడా వేధింపులకు పాల్పడవ్దని ఆమె హెచ్చరించారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు....


* సికింద్రాబాద్, న్యూబోయిగూడకు చెందిన కె.యశ్వంత్ ప్రైవేట్ ఉద్యోగి. బాధిత యువతికి తరచూ ఫోన్ చేసి అసభ్యకరమైన రీతిలో మాట్లాడుతుండడంతో ఆమె షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుచగా ఆరు రోజుల జైలు, రూ. 200 జరిమానా విధించారు.

* కరీంనగర్‌కు చెందిన రాకేశ్ కారు డ్రైవర్. బాధితురాలిని ఫోన్‌లో వేధిస్తూ, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ రాకేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుగా 2 రోజుల జైలు, రూ. 250 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

* గోల్కొండకు చెందిన మహ్మద్ సమీర్ ప్రైవేట్ ఉద్యోగి. బాధితురాలిని ఫోన్‌లో వేధిస్తుండడంతో షీ టీమ్స్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 2 రోజుల జైలు, రూ. 250 జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.

* భోలక్‌పూర్‌కు చెందిన ఎండీ వాసీముద్దీన్ యువతిని ఫోన్‌లో వేధిస్తుండడంతో 2 రోజుల జైలు, రూ. 250 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles