ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Mon,April 8, 2019 09:14 PM

Girlfriend committed suicide  boyfriend harassment

మంచిర్యాల : ప్రియుడి వేధింపులు భరించలేక బూర్ల సంధ్య(17) అనే యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ఓంకార్ యాదవ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లకు చెందిన సంధ్య తండ్రి బూర్ల రాజయ్య ఇటుక బట్టీలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎండీ అక్బర్ సంవత్సరం క్రితం సంధ్యను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె సీసీసీలోని తన మేనమామ ఇంటి వద్ద ఉండగా నమ్మించి తీసుకెళ్లాడు. అక్బర్‌పై సీసీసీ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు కాగా అతను జైలుకు వెళ్లాడు. జైలునుంచి తిరిగి వచ్చాక అక్బర్ ఆగడాలు ఎక్కువకావడంతో రాజయ్య టేకుమట్ల నుంచి కుటుంబాన్ని మంచిర్యాలలోని సున్నంబట్టివాడకు మార్చాడు. ఐనా ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సంధ్య బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

5406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles