అనుమానాస్పదస్థితిలో యువతి అదృశ్యం

Tue,April 23, 2019 07:24 AM

girl missing in mysterious states at hyderabad

దుండిగల్ : అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైం ది. అయితే బాధిత యువతి తల్లి తన కూతురిని కొందరు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ భూపాల్ గౌడ్ కథనం ప్రకారం... సుభాశ్‌నగర్ డివిజన్, సూరారం కాలనీలోని నర్సింహాబస్తీకి చెందిన ఎస్.మేరీకి ఇద్దరు కూతుళ్లు. కాగా.. ఈ నెల 21న సాయంత్రం కూతుళ్లను ఇంట్లో ఉంచి తల్లి షాపూర్‌నగర్‌లోని మార్కెట్‌కు వెళ్లింది. ఇంట్లో ఉన్న మధుప్రియ(18)ను బొల్లారంకు చెందిన యాదు, దిలీప్, అశోక్, సతీశ్, రూపాలి, వర్షా, ఉమాకాంత్‌లు ఆటోలో వచ్చి బొల్లారంకు తీసుకువెళ్లారు.

ఇదే విషయాన్ని మార్కెట్‌కు వెళ్లివచ్చిన మేరీకి చిన్న కూతురు తెలిపింది. అదే సమయంలో తామే మధుప్రియను తీసుకువెళ్లినట్లు పైన తెలిపిన వ్యక్తులు ఫోన్‌చేసి మేరీకి చెప్పారు. కాగా.. మధుప్రియ మేజర్ కావడంతో ప్రేమించిన వ్యక్తితో వెండ్లి అయిపోయిందని విచారణలో తేలడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

2973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles