రోడ్డు ప్రమాదంలో బాలిక మృతిTue,February 13, 2018 09:11 PM

girl killed in road accident

గంగాధర : మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవలసిన బాలిక ఓ లారీ అతి వేగానికి బలైంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో జరిగింది. ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం కురిక్యాల గ్రామానికి చెందిన జంగిలి తిరుపతి-వసంత కూతురు రక్షిత(9) శివరాత్రి సందర్భంగా తల్లి వసంతతో కలిసి గంగాధర చౌరస్తాలో పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లి, తిరిగి ఆటోలో కురిక్యాలకు వచ్చింది. గ్రామ పంచాయతీ సమీపంలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా కరీంనగర్ వైపు నుండి అతి వేగంగా వస్తున్న (ఎంహెచ్ 20 డీఈ 6977) లారీ బాలికను ఢీకొట్టింది. కింద పడిన బాలికపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల నుజ్జు నుజ్జయి మొండెం నుండి వేరయింది. డ్రైవర్ లారీని ఆపకుండా జగిత్యాల వైపు అతి వేగంగా వెళ్లడంతో స్థానికులు వెంబడించి గంగాధర చౌరస్తాలో పట్టుకున్నారు. డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ స్వరూప్‌రాజ్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రధానాసుపత్రికి తరలించారు. కాగా బాలిక మృతికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.

1822
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS