కిడ్నాప్.. బలవంతంగా పెండ్లి..

Fri,January 25, 2019 07:54 AM

girl Kidnapped and forced marriage

అమీర్‌పేట్ : బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేగాక బలవంతంగా పెండ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన సనత్‌నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు యువకుడిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోతీనగర్‌లో నివాసముండే బాలిక స్థానిక ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తుండగా, ఇదే ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి పరిచయం ఉండటంతో ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన దుర్గాప్రసాద్ 10రోజుల క్రితం బాలికను బలవంతంగా పశ్చిమగోదావరి జిల్లాలోని పిఠాపురానికి తీసుకెళ్లిఅక్కడి నుంచి అన్నవరానికి చేరుకుని అక్కడ బాలికను వివాహం చేసుకున్నాడు. తిరిగి సామర్లకోటకు చేరుకుని అక్కడ గదిని అద్దెకు తీసుకుని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ బాలికను గదిలోనే ఉంచి పారిపోయాడు. బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులను ఫోన్‌లో తెలుపడంతో పోలీసులు బాలికను నగరానికి తీసుకువచ్చారు. దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

1008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles