సీఎం కేసీఆర్‌కు సూక్ష్మ కళాకారుడి చిరు కానుక

Wed,December 20, 2017 06:47 AM

gift to CM KCR

హైదరాబాద్ : సూక్ష్మకళా సామ్రాట్ డాక్టర్ ముజంపల్లి విద్యాధర్ సూక్ష్మకళతో స్వర్ణతాపడం ఏనుగుపై బంగారంతో అ, ఆలను రూపొందించారు. హైదరాబాద్ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్, సంతోషిమాత కాలనీకి చెందిన విద్యాధర్ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపారు. డాక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలకు అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసి, తెలుగు భాషను విశ్వవిఖ్యాతం చేయడంలో సఫలీకృతమైన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా చిరు కానుకగా రూపొందించినట్లు వెల్లడించారు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles