ఏప్రిల్ 25 నుంచి జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు

Sat,March 16, 2019 08:17 AM

GHMC Summer Camps from 25th April 2019

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ క్రీండాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన వేసవి శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంపు) ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బల్దియాకు చెందిన వివిధ ఆట మైదానాలు, కాంప్లెక్స్‌లలో వివిధ రకాల క్రీడాంశాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తారు. అలాగే, నగరంలోని ఏడు ప్రాంతాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూళ్లను ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించాలని నిర్ణయించారు.ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణను వివిధ ప్రాంతాల్లోని బల్దియా క్రీడా మైదానాలు, క్రీడా కాంప్లెక్స్‌లలో సుమారు 51 క్రీడాంశాల్లో ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ, సీనియర్ కోచ్‌లతో నిర్వహించే శిక్షణ శిబిరాల్లో ఆరు సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిభిరాల ద్వారా ఇప్పటివరకు 33లక్షల మందికి పైగా బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణనిచ్నిట్లు, శిక్షణ తీసుకున్నవారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేకున్నవారు ఎందరో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ నుంచి బ్యాడ్మింటన్‌లో ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి.సింధు వరకు ఎంతో మంది జీహెచ్‌ఎంసీ క్రీడా మైదానాల ద్వారా ఎదిగినవారేనని వారు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ప్రస్తుతం 521 క్రీడా మైదానాలు, 7స్విమ్మింగ్ పూల్‌లు, 18 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, 7రోలర్స్ స్కేటింగ్ రింగులు, 5 టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. పలు ఆట మైదానాల్లో ప్రతినెలా ఒక్కో క్రీడపై ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహిస్తారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఎంపికచేసి వారిని ప్రత్యేక టీంగా తయారు చేస్తారు. వారిని స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పంపుతారు.

వేసవి శిక్షణ శిబిరాల క్రీడాంశాలు


1. సాహస క్రీడ, 2. అథ్లెటిక్స్, 3.ఆర్చరీ, 4. బాల్ బ్యా డ్మింటన్, 5. బాస్కెట్ బాల్, 6. బేస్ బాల్, 7. బాక్సింగ్, 8. బాడిబిల్డింగ్, 9. షటిల్ బ్యాడ్మింటన్, 10. చెస్, 11. క్యారమ్స్, 12. క్రికెట్, 13. సైక్లింగ్, 14. ఫుట్ బాల్, 15. ఫెన్సింగ్, 16. జిమ్నాస్టిక్, 17. హ్యాండ్ బాల్, 18. హాకీ, 19. జుడో, 20. కరాటే, 21. కబడ్డీ, 22. ఖో ఖో, 23. కిక్ బాక్సింగ్, 24. మల్కంబ, 25. నెట్ బాల్, 26. రోలర్ స్కేటింగ్, 27. రైఫిల్ షూటింగ్, 28. సెపక్ తక్ర, 29. సాఫ్ట్ బాల్, 30. టేబుల్ టెన్నిస్, 31. తైక్వాం డో, 32. టెన్నీస్, 33. టెన్నీకాయిట్, 34. టగ్గాఫ్ వార్, 35. త్రో బాల్, 36. వాలీబాల్, 37. వెయిట్ లిఫ్టింగ్, 38. రెస్లింగ్ ఇండియా, 39. వెస్లింగ్ రోమన్, 40. వుషు, 41, యోగా, 42. క్రాఫ్ బాల్, 43. పవర్ లిఫ్టింగ్, 44. బీచ్ వాలీబాల్, 45. స్కై మార్షల్ ఆర్ట్స్, 46. వో వినమ్

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు....


జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో పాల్గొనాలన్న ఆసక్తిగలవారు ఆన్‌లైన్‌లో http://www.ghmc.gov.in/sports అనే వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. క్రికెట్, టెన్నీస్, స్కేటింగ్, షటిల్ బ్యాడ్మింటన్లో శిక్షణ పొందేవారు ఆధార్‌కార్డు, మొబైల్ నెంబర్‌తోపాటు రూ. 50ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఇతర క్రీడాంశాలకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, స్విమ్మింగ్‌కు సైతం ఆన్‌లైన్‌లోని పేర్లు నమోదుచేసుకోవాల్సివుంటుందని అధికారులు తెలిపారు.

678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles