వ‌ర్షాకాల విపత్తుల నిర్వహణపై జీహెచ్ఎంసీ అధికారుల సమావేశం

Sat,May 25, 2019 07:22 PM

ghmc coordination meeting on Monsoon Disaster management

హైదరాబాద్: జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆధ్వ‌ర్యంలో సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. రానున్న వ‌ర్షాకాల సీజ‌న్‌లో వ‌చ్చే ఆక‌స్మిక విప‌త్తుల‌ను ఎదుర్కోవ‌డానికి స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డం, మే 31వ తేదీ నుంచి న‌గ‌రంలో రోడ్ల త‌వ్వ‌కాల‌పై నిషేదం, ఎస్‌.ఆర్‌.డి.పి ప్రాజెక్ట్ పనుల సంద‌ర్భంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌లకు వెంట‌నే ప‌రిష్కారం పొంద‌డం, జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ స్థాయిలో తిరిగి స‌మ‌న్వ‌య స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం లాంటి ప్ర‌ధాన అంశాల‌పై నేడు జ‌రిగిన సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశంలో నిర్ణ‌యించారు. సమావేశంలో హైద‌రాబాద్ మెట్రోరైలు ఎం.డి ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, హైద‌రాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ జి.ర‌వి, ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ డిసిపిలు చౌహాన్‌, విజ‌య్‌కుమార్‌, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటిల‌తో పాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రయ్యారు. వ‌రుస ఎన్నిక‌ల నేప‌థ్యంలో సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం చివ‌రిసారిగా ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన జ‌రిగింది. దాదాపు మూడు నెల‌ల అనంత‌రం నేడు జ‌రిగిన స‌మావేశంలో ప‌లు కీలక నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు.

ఈ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు...


* జూన్ రెండో వారం నుండి వ‌ర్షాకాలం ప్రారంభం కానున్నందున న‌గ‌ర‌వాసుల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా మే 31వ తేదీ నుండి న‌గ‌రంలో అన్ని ర‌కాల రోడ్డు త‌వ్వ‌కాల‌పై నిషేదం విధింపు.
* ఇప్ప‌టికే జారీచేసిన రోడ్డు త‌వ్వ‌కాల అనుమ‌తుల‌కు సంబంధించిన పనుల‌న్నింటిని మే 31వ తేదీలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది.
* అన్ని ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తులు, పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌న్నింటిని జూన్ 5వ తేదీలోపు పూర్తిచేయాలి.
* న‌గ‌రంలో ఇప్ప‌టికే చేప‌ట్టిన మ్యాన్‌హోళ్ల పున‌రునిర్మాణం ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌పై పూర్తిచేయాలి. అన‌వ‌స‌రంగా మ్యాన్‌హోళ్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతున్నార‌నే ప్ర‌తికూల వార్త‌ల‌పై త‌గు వివ‌ర‌ణ ఇవ్వాలి.
* వ‌ర్షాకాల విప‌త్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు న‌గ‌రంలోని ప్ర‌తి శాఖ ప్ర‌త్యేకంగా ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించాలి.
* ప్ర‌తి విభాగం ఆధ్వ‌ర్యంలో ఉన్న విప‌త్తుల నివార‌ణ బృందాల వివ‌రాల‌ను జీహెచ్ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ విభాగానికి అంద‌జేయాలి.
* భారీ వ‌ర్షాల వ‌ల్ల రోడ్ల‌పై చెట్లు, భారీ వృక్షాలు కూలి ట్రాఫిక్ అంత‌రాయం ఏర్ప‌డితే ప్ర‌త్యామ్న‌య ర‌హ‌దారుల‌ను గుర్తించాలి.
* న‌గ‌రంలో వ‌ర్షాకాలం సంద‌ర్భంగా ఐదు సెంటిమీట‌ర్ల‌కు పైగా ఆక‌స్మిక వ‌ర్షాలు కురిసి లోత‌ట్టు ప్రాంతాలు ముంపుకు గురి అయితే ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల్లోకి త‌క్ష‌ణ‌మే త‌రిలించేందుకు వీలుగా ప్ర‌తి వార్డులో క‌మ్యునిటీహాళ్లు, పాఠ‌శాల‌లు, ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించాలి.
* వ‌ర్షాకాల ప్ర‌వేశానికి ముందే రోడ్ల‌పై ఉన్న గుంత‌లు, మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తిచేయాలి.
* మెట్రో కారిడార్ వెంట నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ల‌పై వెల‌సిన ఆక్ర‌మ‌ణ‌లను తొల‌గించాల‌ని నిర్ణ‌యం.
* మెట్రో కారిడార్ వెంట ఉన్న దాదాపు 60కి పైగా హోర్డింగ్‌ల‌ను జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో తొల‌గింపు.
* మెట్రో కారిడార్ వెంట ర‌హ‌దారులు, ప్రాంతాలు ఆహ్లాద‌క‌రంగా ఉండేందుకు ఆయా మార్గాల్లో ఉన్న నిర్మాణ వ్య‌ర్థాలు, గార్బేజ్‌ను తొల‌గించాలి.
* మ‌ల‌క్‌పేట్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద మ‌రో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ‌తో పాటు అంత‌ర్గ‌తంగా భూసేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు ఈ మ‌ల‌క్‌పేట్ ఆర్‌.యు.బి ప్రాంతాన్ని స్వ‌యంగా ప‌రిశీలించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌ నిర్ణ‌యం.
* సైబ‌రాబాద్ పోలీస్‌ క‌మిష‌న‌రేట్ మార్గం, బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్, ఖాజాగూడ ఫ్రీ లెఫ్ట్ మార్గాల్లో ర‌హ‌దారుల పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం.
* ఎల్బీన‌గ‌ర్ నుండి బైరామ‌ల్‌గూడ మార్గంలో ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల నేప‌థ్యంలో ట్రాఫిక్ తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతున్నందున బైరామ‌ల్‌గూడ వ‌ద్ద భూసేక‌ర‌ణను వెంట‌నే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం.
* ఎల్బీన‌గ‌ర్‌లో ఇటీవ‌ల పూర్తై ప్రారంభ‌మైన రెండు ఫ్లైఓవ‌ర్ల వెంట రోడ్ల పై బిటీ లేయ‌ర్‌ను వేయాల‌ని నిర్ణ‌యం.
* న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్న‌ల్స్ పున‌రుద్ద‌ర‌ణ‌కు చ‌ర్య‌లు.
* సికింద్రాబాద్ మిల‌ట‌రీ ఇంజ‌నీరింగ్ స‌ర్వీసెస్ (ఎం.ఇ.ఎస్‌) ప్రాంతంలో స‌రిప‌డ నీటి స‌ర‌ఫ‌రాను అందించాల‌నే ఆర్మి అధికారుల విజ్ఞ‌ప్తిని ప‌రిశీలించాల‌ని దాన‌కిషోర్ ఆదేశించారు.
* జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్ కార్యాల‌యాల ప‌రిధిలో తిరిగి అంత‌ర్గ‌త స‌మ‌న్వ‌య స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.
* సూర‌త్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం నేప‌థ్యంలో న‌గ‌రంలోని అన్ని కోచింగ్ సెంట‌ర్లు, విద్యా సంస్థ‌లలో అగ్నిప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌ల‌పై త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.

ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, శృతిఓజా, కృష్ణ‌, చీఫ్ ఇంజ‌నీర్లు సురేష్‌, జియాఉద్దీన్‌, శ్రీ‌ధ‌ర్‌, జ‌ల‌మండ‌లి డైరెక్ట‌ర్లు కృష్ణ‌, సూర్య‌నారాయ‌ణ‌, ప్ర‌వీణ్‌కుమార్‌, ర‌వి, ఎస్‌.పి.డి.సి.ఎల్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

1205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles