నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు

Tue,June 18, 2019 10:53 AM

GHMC construction waste Recycling plant at medchal

మేడ్చల్: జీడిమెట్లలో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్లాంటును జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వారం రోజుల్లో రీసైక్లింగ్ ప్లాంట్ ట్రయల్న్ ప్రారంభిస్తామన్నారు. నిర్మాణరంగం వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లో ఇదే మొదటిది. రోజుకు 500 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు రీసైక్లింగ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. మరో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు తగు భూమిని కేటాయించాల్సిందిగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరగా భూ కేటాయింపుకు కలెక్టర్లు అంగీకరించారు. నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా పడేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా డంప్ చేసే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles