అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమీక్ష సమావేశం

Sun,June 23, 2019 04:12 PM

GHMC Commissioner Dana Kishore review meeting with officials

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్ల నిర్వహణ, వర్షాకాలం విపత్తులపై ఇంజినీరింగ్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. వ‌ర్షాకాల విప‌త్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునేందుకు న‌గ‌రంలోని ప్ర‌తి శాఖ ప్ర‌త్యేకంగా ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించాలి. ప్ర‌తి విభాగం ఆధ్వ‌ర్యంలో ఉన్న విప‌త్తుల నివార‌ణ బృందాల వివ‌రాల‌ను జీహెచ్ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ విభాగానికి అంద‌జేయాలి. భారీ వ‌ర్షాల వ‌ల్ల రోడ్ల‌పై చెట్లు, భారీ వృక్షాలు కూలి ట్రాఫిక్ అంత‌రాయం ఏర్ప‌డితే ప్ర‌త్యామ్న‌య ర‌హ‌దారుల‌ను గుర్తించాలి. న‌గ‌రంలో వ‌ర్షాకాలం సంద‌ర్భంగా ఐదు సెంటిమీట‌ర్ల‌కు పైగా ఆక‌స్మిక వ‌ర్షాలు కురిసి లోత‌ట్టు ప్రాంతాలు ముంపుకు గురి అయితే ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల్లోకి త‌క్ష‌ణ‌మే త‌రిలించేందుకు వీలుగా ప్ర‌తి వార్డులో క‌మ్యునిటీహాళ్లు, పాఠ‌శాల‌లు, ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించాలని ఆదేశించారు. ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, శృతిఓజా, కృష్ణ‌, చీఫ్ ఇంజ‌నీర్లు సురేష్‌, జియాఉద్దీన్‌, శ్రీ‌ధ‌ర్‌, జ‌ల‌మండ‌లి డైరెక్ట‌ర్లు కృష్ణ‌, సూర్య‌నారాయ‌ణ‌, ప్ర‌వీణ్‌కుమార్‌, ర‌వి, ఎస్‌.పి.డి.సి.ఎల్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles