అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు

Mon,September 16, 2019 06:30 AM

హైదరాబాద్‌ : ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్‌ నగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమ లు చేస్తున్నది. దోమలవ్యాప్తిని అరికట్టడం ద్వారా అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టింది. నగరంలోని ప్రధాన రెఫరల్‌ హాస్పటల్స్‌ ఫీవర్‌, గాంధీ, ఉస్మాని యా, నిలోఫర్‌లో 25మంది చొప్పున అదనపు డాక్టర్లతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులతోపాటు నగరంలో ఉన్న 95 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఈవినింగ్‌ క్లినిక్‌లను నిర్వహించడంతోపాటు 105 బస్తీ దవాఖానల్లోనూ పూర్తిస్థాయి మందులు, సిబ్బందితో డెంగీ, సీజనల్‌ వ్యాధులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.


బస్తీ దవాఖానల్లో 200 రకాల వైద్య పరీక్షలు, 150 రకాల మందులను ఉచితంగా పం పిణీ చేపట్టింది. ప్రతి ఆసుపత్రిలోనూ కేవలం 60 నిమిషాలలోపే ఔట్‌ పేషంట్‌లకు పరీక్షలు నిర్వమించే విధంగా అదనపు కౌంటర్లను, డాక్టర్లను జీహెచ్‌ఎంసీ నియమించింది. ఇప్పటివరకు నగరంలో 500లకుపైగా ఉచిత వైద్య శిబిరాలను నగరంలోని హైరిస్క్‌ ప్రాంతాల్లో నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో ఉన్న 2,375 సిబ్బంది నిరంతరం లార్వా నివారణ కార్యక్రమాలను చేపట్టడంతోపాటు నీటి నిల్వలు, అపరిశుభ్ర పరిసరాల వల్ల దోమల వ్యాప్తి ఏ విధంగా జరుగుతుందో తెలియచేసే చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజూ 650 ఎంటమాలజీ బృందాలు దోమల వ్యాప్తికి కారకమైన లార్వా నివారణ మందు స్పేయింగ్‌ చేయడం ఇతర చర్యలను చేపట్టడం జరుగుతున్నది. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సం పులు, నల్లా గుంతలతోపాటు డ్రమ్‌లు, డబ్బాలు ,కుండలు, టైర్లలో నీటి నిల్వలను తొలిగిస్తున్నారు.

ప్రతిరోజూ 150 కాలనీల్లో ఫాగింగ్‌


150 పోర్టబుల్‌, 10 ఫాగింగ్‌ మిషన్లు కలిగిన వాహనాల ద్వారా ప్రతిరోజూ 150 కాలనీల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఫాగింగ్‌ చేస్తున్నది. నిర్వహించే ప్రతికాలనీ, బస్తీలోని నివాసితులు, స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమసంఘాలు, కార్పొరేటర్ల నుంచి ధ్రువీకరణ సంతకాలను కూడా సేకరిస్తున్నారు. గతంలో డెంగీ , మలేరియా కేసులు ప్రబలిన ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ ద్వారా అనుసంధానించడంతోపాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డెంగీ ఫాజిటివ్‌ కేసులు వచ్చిన ఇళ్లను గుర్తించి 50 మీటర్ల వరకు విస్తృతంగా ఫాగింగ్‌ చేపట్టారు. ఇప్పటివరకు 1800 పాఠశాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్తాపూర్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకు గల మూసీ ఇరువైపులా 126మంది సభ్యులు గల 42 లార్వా నిరోధక బృందాలు దోమల వృద్ధి నివారణకు స్ప్రేయింగ్‌, వ్యర్థాల తొలిగింపును చేపడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని ప్రధాన చెరువుల్లో దోమలను ఉత్పత్తి చేసే గుర్రపుడెక్క ఆకును నిరంతరం తొలిగిస్తున్నారు. నగరంలోని చెరువుల్లో దోమల నివారణకు డ్రోన్‌ల ద్వారా మందును స్ప్రే చేస్తున్నారు.

గతంలో మలేరియా , డెంగ్యూ, చికెన్‌గున్యా వచ్చిన ప్రాంతాలను హాట్‌స్పాట్‌గా గుర్తించి వీటిని జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేసి వాటిపై తిరిగి అంటువ్యాధుల నిరోధానికి ప్రత్యేక దృష్టిని సారించారు. నగరంలోని 4,500 స్వయం సహాయక బృందాల్లోని నాలుగున్నర లక్షల మంది మహిళలను ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇంటిపన్ను చెల్లిస్తున్న 10.50 లక్షల మంది మొబైల్స్‌కు డెంగీ నివారణ చర్యలపై అవగాహన సందేశాలను పంపిస్తున్నారు. మై జీహెచ్‌ఎంసీ యాప్‌, డయల్‌ 100 ద్వారా జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌, ఇ-మెయిల్‌ వాట్సాప్‌ తదితర మాధ్యమాల ద్వారా దోమల బెడద, అంటువ్యాధులపై అందే ఫిర్యాదులపై వెంటనే జీహెచ్‌ఎంసీ స్పందించింది. మీడియా ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పాఠశాలలు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, గోడౌన్‌లు వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఐదు లక్షల కరపత్రాలను ప్రత్యేకంగా ముద్రించడంతోపాటు, 50 ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles