మెట్రో ప్రయాణికుల కోసం సిద్ధం కండిFri,October 13, 2017 11:13 AM
మెట్రో ప్రయాణికుల కోసం సిద్ధం కండి

సికింద్రాబాద్ : మెట్రోరైలు ప్రయాణికులను ఇబ్బందులు లేకుండాగమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ.రమణారావు గ్రేటర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ జేబీఎస్‌లోని గ్రేటర్ ఈడీ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేపట్టగా, ఇందులో కొత్తగా మెట్రోకు అనుసంధానంగా చేపట్టబోయే రూట్ల సర్వీసులుపై ఎండీకీ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రోరైలు అధికారులతో కలిసి పనిచేయాలని, వారి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాలనీలు, ఇతర ముఖ్యప్రాంతాలపై సర్వే జరిపి ప్యాసింజర్ అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపాలన్నారు. ప్రయాణికులకు సేవలందించడంలో టీఎస్‌ఆర్టీసీ మార్కెట్ షేర్ పెరగాలన్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో భాగంగా బస్‌బేలు, బస్సులు నడిపించే రూట్లు, 24 స్టేషన్లకు అనుసంధానంగా బస్సుల ఆపరేషన్లు తదితర అంశాలపై చర్చ జరిగింది.గ్రేటర్ ఆర్టీసీ హైదరాబాద్, ఐటీ ఈడీ ఏ. పురుషోత్తం నాయక్, జాయింట్ డైరెక్టర్ కే. వెంకట్రావు, గ్రేటర్ హైదరాబాద్ ఆపరేషన్స్ అండ్ ఇంజినీరింగ్ చీఫ్ మేనేజర్ కొమురయ్య, హైదరాబాద్ రీజినల్ మేనేజర్ ఎం. వెంకటేశ్వర్‌రావు, సికింద్రాబాద్ ఆర్‌ఎం. జీ.రమాకాంత్, డిప్యూటీ సీటీఎం పీ.జీవన్ ప్రసాద్ పాల్గొన్నారు.

1359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS