బాలికపై గ్యాంగ్‌రేప్.. 10మంది యువకుల పైశాచికత్వం

Sat,March 17, 2018 11:32 PM

Gangrape on minor girl in bhadradri kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం: కామాందులు రెచ్చిపోయారు. ఓ బాలిక(15)ను బలవంతంగా ఆటోలో లాక్కువెళ్లిన సుమారు 10 నుంచి 12మంది యువకులు... 20 గంటల పాటు నిర్భందించి లైగింకదాడి జరిపారు. కాళ్లు పట్టుకుని రోదిస్తున్న కనికరించకుండా మానవమృగాల్లా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన పినపాక మండలంలోని జానంపేట పంచాయతీ పాండురంగాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పాండురంగాపురం గ్రామానికి చెందిన గిరిజన బాలిక ఈనెల 11వ తేదీ ఆదివారం తన పుట్టినరోజు కావడంతో స్నేహితురాళ్లకు స్వీట్లు పంచిపెడదామని గ్రామంలోని ఓ కిరాణా షాపు వద్దకు ఉదయం 10గంటల సమయంలో వెళ్లింది. షాపులో స్వీట్లు కొనుక్కుని తిరిగి వస్తుండగా అమరవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని సమీప అడవుల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది.

అంతేగాక అక్కడికి మరికొంతమందిని వారు ఫోన్ చేసి పిలిపించగా వారు కూడా తనపై అత్యాచారం చేశారని, అక్కడ నుంచి తనను బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లారని అక్కడ వీరితో పాటు మరికొంతమంది వచ్చి మరల అత్యాచారం చేశారని వాపోయింది. పొద్దుపోయిన తరువాత అదే ఆటోలో అమరవరం గ్రామంలోకి తీసుకెళ్లారని రాత్రి అంతా ఆ ఇంట్లో తనపై పాతవారితో పాటూ మరికొంతమంది వచ్చి తనపై అత్యాచారం జరిపి వెళ్లిపోయారని తెలిపింది.

స్పృహలేకుండా ఉన్న తాను తెల్లవారిన తరువాత లేచి కొంతదూరం నడిచివెళ్లి అక్కడ నుంచి తన అన్నయ్య దగ్గరికి వాజేడు మండలం వెళ్లినట్లు పేర్కొంది. తనకు జరిగిన అన్యాయాన్ని తన అన్నయ్య దృష్టికి తీసుకెళ్లి అన్నయ్యతో పాటూ గ్రామానికి వచ్చి తన తల్లికి వివరాలు వెల్లడించినట్లు తెలిపింది. ఈనెల 11వ తేదీన ఆదివారం ఇంటి నుండి బయటికి వెళ్లిన తన కూతురు కనిపించడం లేదని మాత్రమే ఈనెల 14వ తేదీన ఈబయ్యారం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు తల్లి వెంకటమ్మ ఫిర్యాదు చేసినట్లు ఈబయ్యారం ఏఎస్సై లక్ష్మయ్య తెలిపారు. అంతేతప్ప మిగతా వివరాలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని భాదితురాలి తల్లి వెంకటమ్మ తెలిపారు. ఆమె శనివారం సాయంత్రం విలేకర్ల బృందంతో మాట్లాడారు. జరిగిన అఘాయిత్యంపై వివరాలతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

5419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS