గజ్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం : హరీష్

Mon,May 15, 2017 01:27 PM

Gajwel Municipality will develop by TRS Govt, says Harish rao

సిద్ధిపేట : జిల్లాలోని గజ్వేల్‌లో నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పాదయాత్ర చేపట్టారు. పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజ్ఞాపూర్‌లో వైకుంఠధామం నిర్మాణానికి రూ. 50 లక్షలు, మహిళా భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ప్రజ్ఞాపూర్‌లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ. 2 కోట్లు , కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నెల 25వ తేదీలోగా ప్రజ్ఞాపూర్‌లో ఇంటింటికి మంచి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles