తెలంగాణ బిడ్డలందరికీ పూర్తి సహకారం: కేటీఆర్

Wed,October 25, 2017 08:27 PM

Full cooperation who have set up small textile industries

హైదరాబాద్: రాష్ట్రంలో టెక్స్‌టైల్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే తెలంగాణ బిడ్డలందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గుజరాత్ టెక్స్‌టైల్ హబ్ సూరత్‌లో స్థిరపడ్డ తెలంగాణ నేత కార్మికులు ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు హర్షం వ్యక్తం చేస్తూ నేతన్నలు కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగానికి ఇస్తున్న చేయూత గొప్పగా ఉందని కొనియాడారు. పొట్ట చేత పట్టుకుని వలసపోయిన నేత కార్మికుల స్థితిగతులను గత 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికులకు అండగా ఉంటామన్న సీఎం కేసీఆర్ పిలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో నేత కార్మికులు సూరత్ వెళ్లి స్థిరపడ్డారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ సూరత్ నేతన్నలను తిరిగి రావాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీఎం పిలుపు మేరకు వలస వెళ్లిన నేతన్నలంతా తిరిగి స్వరాష్ర్టానికి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గుజరాత్‌లోని సూరత్, మహారాష్ట్రలోని భీవండీ నుంచి తెలంగాణకు తిరిగి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో నేత కార్మికులు ఎదురుచూస్తున్నరని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles