దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ మ‌న ఫ్రెండ్లీ పోలీస్‌

Sun,December 24, 2017 01:59 PM

friendly police number one in our country

హైదరాబాద్: బాలాన‌గ‌ర్ పోలీస్ స్టేషన్ లో అద‌న‌పు గ‌దులను వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ‌ను నేర‌ర‌హితంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని అన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌న రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అని అభినందించారు. ఫ్రెండ్లీగా సేవ‌లు అందిస్తున్న ఏకైక పోలీస్ అని కొనియాడారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ అద్భుతంగా ప‌ని చేస్తున్నాయ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో మొత్తం పోలీసు వ్య‌వ‌స్థ బాగుప‌డింద‌ని మంత్రి అన్నారు.

బాలాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో అద‌న‌పు గ‌దుల‌ను ప్రారంభించిన అనంత‌రం పోలీసు స్టేష‌న్‌లో సీసీ కెమెరాల ప‌నితీరుని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నేర ర‌హితంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయ‌న్నారు. విశ్వ‌న‌గ‌రం ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ల‌క్ష‌కు పైగా సీసీ కెమెరాలు అమ‌ర్చ‌డం, నిరంత‌రం నిఘా ఏర్పాటు చేయ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసులకు నిధులు పెంచ‌డం, హోంగార్డుల‌కు జీతాలు పెంచ‌డం, వాహ‌నాలు ఇవ్వ‌డం ఇలా అనేక స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో మ‌న పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నార‌ని మంత్రి తెలిపారు.

దీంతో శాంతి భ‌ద్ర‌త‌ల ర‌క్ష‌ణ‌లో మ‌న పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా పేరు గాంచారన్నారు. తెలంగాణ ఆవిర్భౄవం తర్వాత పోలీసు సంస్క‌ర‌ణల వ‌ల్ల రాష్ట్రంలో నేరాల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌న్నారు. షీ టీమ్స్ మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్నారు.

వైద్య‌శాల‌ను ప‌రిశీలించిన మంత్రి

బాలాన‌గ‌ర్ లోని 30 ప‌డ‌క‌ల వైద్య‌శాల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి ప‌రిశీలించారు. ఆధునీక‌ర‌ణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. రాష్ట్రంలో వైద్య వ్య‌వ‌స్థ ఓ గాడిలో పడింద‌న్నారు. నిరంతరంగా చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌ వైద్య‌శాల‌ల‌పై న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు వ‌స్తున్నార‌న్నారు. మ‌రిన్ని వైద్య సేవ‌ల‌ను పెంచ‌డానికి కృషి చేస్తున్నామ‌న్నారు. అధునాత‌న ప‌రిక‌రాలు, స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

2517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles