Telangana Intermediate 1st & 2nd Year Results 2019

పేద విద్యార్థులకు కోచింగ్..అండగా ప్రభుత్వం

Fri,March 22, 2019 06:35 AM

Free training to STudents For neet, MBBS, Agriculture

హైదరాబాద్ : వారంతా కడు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. లక్షలు, వేలు ఖర్చు చేసి ఎంసెట్‌, నీట్‌ వంటి కోర్సుల ప్రవేశపరీక్షలకు కోచింగ్‌ తీసుకునేందుకు శక్తి చాలదు. నైపుణ్యం, ఆసక్తి ఉంది. కానీ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సన్నద్ధమయ్యే విధానాలు తెలియవు. ఇలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. శిక్షణ శిబిరం ఏర్పాటుతో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 4 చోట్ల ఇలాంటి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో బాలికలకు ప్రత్యేకంగా 6వ జోన్‌ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ మోడల్‌ స్కూల్స్‌ నుంచి 150 మందిని ఎంపిక చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకుల పరిధిలోని ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో 45 రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ప్రభత్వ మోడల్‌ స్కూల్స్‌ సోసైటీ(టీఎస్‌ఎంఎస్‌) అడిషనల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ లింగయ్య పర్యవేక్షణలో ఏప్రిల్‌ 30 వరకు ఈశిక్షణ శిబిరం కొనసాగుతంది. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌, యాదాద్రి(చౌటుప్పల్‌), వరంగల్‌ అర్బన్‌(కమలాపూర్‌), వరంగల్‌ రూరల్‌(వంచనగిరి)లలో కొనసాగుతున్నవి. వారందరికి శిక్షణ ఇచ్చేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. భోజనం, వసతితో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. వివిధ కళాశాలలో ఉత్తమమైన మార్కులు పొందిన వారు. పాలమాకులలో ఇపుడు శిక్షణ పొందుతున్న బ్యాచ్‌ 4 వది. గత ఏడాది వరకు సుమారు 60 మంది పైగా విద్యార్థులు, ఎంబీబీఎస్‌, ఎంసెట్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సులలో శిక్షణ పొంది ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది కూడ మరింత ఎక్కువ మంది ఎంపిక అయ్యే విధంగా శిక్షణను ఇస్తున్నారు. సాధించాలనే పట్టుదల, లక్ష్యంతో ఉన్న పేద విద్యార్థులకు ఇది ఎంతో దోహదపడుతుంది.

విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ


విద్యార్థులను తెల్లవారు జామున 5 గంటలకు నిద్ర లేపుతారు. వ్యాయామం, కాలకృత్యాలు, దినచర్యలతో వారి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతీ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటారు. తరగతి గదులలో యథావిధిగా పాఠ్యాంశాలు బోధిస్తారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఎంసెట్‌, నీట్‌ కోర్సులలో ప్రత్యేకంగా నియమితులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు. నిర్ణీత సిలబస్‌, టాలెంట్‌ టెస్టులు, ఎప్పటికపుడు విద్యార్థుల ప్రతిభపై సమీక్షలు నిర్వహిస్తారు. 45 రోజుల పాటు ఇక్కడే ఉండి శిక్షణ పొందుతారు. కోసం ప్రభుత్వం కృషి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles