ఎస్సెస్సీ పౌండేషన్‌ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

Wed,June 12, 2019 06:17 AM

free training on courtesy by ssc foundation


రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో ఆర్థికంగా వెనకబడిన వారికి కోచింగ్‌ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి అంకం శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

స్టేట్‌ సర్వీసెస్‌ ,గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఎస్సై, కానిస్టేబుల్‌, బ్యాంకింగ్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ పౌండేషన్‌ ఆధ్వర్యంలో 5 నెలల 15 రోజుల పాటు ఉచిత శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 20 లోపు tsscstudycircle.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష ద్వారా ఎంపిక చేయబడ్డ అభ్యర్థులకు 5నెలల15 రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్‌ వసతి కల్పించనున్నామని , వివరాలకు 90009 19109,77298 92772 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

1711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles