నిరుద్యోగుల జీవితాల్లో వెలుగునింపుతున్న బైరెడ్

Tue,September 4, 2018 07:14 AM

free training for unemployees by Bankers Institute of Rural and Entrepreneurship Development

వివిధ కోర్సులో ఉచిత శిక్షణ
బ్యాంకుల ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న ఇనిస్టిట్యూట్


హైదరాబాద్ : నిరుద్యోగ విద్యార్థులు, యువత జీవితాల్లో వెలుగులు నింపుతున్నది బైరెడ్ (బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ). గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో విద్యార్థులు, యువకులను మెరికలుగా తీర్చిదిద్దేందుకు 2007లో ఏర్పాటయింది. నాబార్డ్, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్‌ల ఆర్థిక సహకారంతో ప్రారంభించిన ఈ ఇనిస్టిట్యూట్‌లో ప్రతి సంవత్సరం బ్యాచ్‌కు 150 మంది చొప్పున ఏడు బ్యాచ్‌లను నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగేలా ఈ శిక్షణ వారికి దోహదపడుతున్నది. అదే విధంగా కనీస విద్యార్హత ఏడో తరగతి చదివిన వారికి వారు ఎంచుకున్న కోర్సులో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.

కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఫోన్‌లో ఇంటర్వ్యూ చేసిన అనంతరం వారు శిక్షణ పొందేందుకు ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులు, యువకులకు వారి గ్రామాల నుంచి రాను పోను ఖర్చులతో పాటు ఉచిత వసతి, భోజనాన్ని అందిస్తారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రారంభించే వ్యాపారాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బైరేడ్‌లో చేరేందుకు యువత ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ చేరేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రతి బ్యాచ్‌లో 150 మంది చొప్పున శిక్షణ పొందేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఏడు బ్యాచ్‌లను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 12,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా అందులో దాదాపు 71 శాతం మంది ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉద్యోగం, స్వయం ఉపాధి పొందే వరకు బైరెడ్ అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారు. శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో గ్రామాల్లో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు జరిగేలా బైరెడ్ సంస్థ కృషి చేస్తున్నది.

ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు...
బైరెడ్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఎంపిక చేపడుతుంది. వారిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి 40 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. తర్ఫీదు పొందే వారికి రాను, పోను ఖర్చులతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. యువకులకు ఎలక్ట్రీషన్, వైండింగ్, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ శిక్షణ, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎంట్రీ, టాలీలో శిక్షణ కొనసాగిస్తున్నారు. గ్రాఫిక్స్‌ను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు మగ్గం, జర్దోషి, టైలరింగ్, బ్యూటీషియన్, డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎంట్రీ, టాలీల్లో శిక్షణ ఇస్తారు. యువకులకు సంవత్సరంలో ఐదు బ్యాచ్‌లను నిర్వహిస్తుండగా మహిళల కోసం రెండు బ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలంలో ఆరోగ్య సూత్రాలను కూడా బోధిస్తున్నారు.

4789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles