వికలాంగులకు ఉచిత శిక్షణ, వసతి

Sun,August 13, 2017 06:40 AM

free training for physically disabled persons

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నిరుద్యోగ శారీరక వికలాంగులైన యువతీ, యువకులకు ఎస్‌డీడీయూజీకేవై, ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ ఆపరేషన్స్ పి.శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి ఆ పైన పాస్/ఫెయిల్ అయిన వారు, 18-35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు దీనికి అర్హులన్నారు. స్పోకెన్ ఇంగ్లీషు, ఎంఎస్ ఆఫీస్, బీపీఓ కాల్‌సెంటర్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యూనికేషన్, సాఫ్ట్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి, 2 జతల దుస్తులు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 16లోపు పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు సెల్ : 9959845076, 9963810285, 7995016095లలో సంప్రదించాలని కోరారు.

1004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS