'లా' చేసిన విద్యార్థులకు ఉచిత శిక్షణ

Wed,June 19, 2019 06:52 AM

Free training for Law completed students

రంగారెడ్డి : జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లా చేసిన విద్యార్థులకు ఉచిత శిక్షణ, న్యాయవాది వృత్తిలో మూడు సంవత్సరాలపాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. 2019-20 సంవత్సరంకు సంబంధించి జిల్లాకు సంబంధించి లా కోర్సు పూర్తి చేసిన బీసీ యువతీ, యువకులు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
నిబంధనలు..
* అభ్యర్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి గుర్తింపు పొందిన కళాశాల నుండి లా కోర్సు పాసై ఉండాలి.
* వయోపరిమితి జూలై 2019నాటికి 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
* తండ్రి / సంరక్షకుని వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, (గ్రామీణం), రూ.2.00 లక్షలు (అర్బన్) మించరాదు.
* అభ్యర్థులు గానీ, వారి కుటుంబంలో వారెవరైనా గానీ గతంలో ఈ ఉచిత శిక్షణ పొంది ఉండరాదు. (డిక్లరేషన్ జతచేయవల్సి ఉంటుంది)
* బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
అర్హులైన బీసీ యువతీ, యువకుల నుంచి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో(కలెక్టరేట్) జూలై 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల బీసీ యువతీ, యువకులు సద్వివినియోగం చేసుకోవాలన్నారు. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలు, తెల్ల కాగితంపై పూర్తి వివరాలు వివరంగా తెలుపాలన్నారు.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles