సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కోచింగ్

Tue,June 11, 2019 11:02 AM

Free coaching in Siddipet BC Study Circle

సిద్దిపేట : సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్ ఉద్యోగాలు, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ పరీక్షల కోసం ఉచితంగా నాలుగు నెలల పాటు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాములు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు 39 సంవత్సరాలలోపు గల వారికి ఈ అవకాశం కలదన్నారు. స్టడీ సర్కిల్‌లో కోచింగ్ కోసం 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు, ఇతరులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారన్నారు. కోచింగ్ సమయంలో మెటీరియల్ కూడా ఉచితంగా అందజేయబడుతుందన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో http//tsbcstudycireles.cgg.govt.in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 30 వరకు స్వీకరించబడుతాయన్నారు. వచ్చే నెల 2న అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రంతో పాటు గ్రామీణ ప్రాంతం వారైతే సంవత్సరానికి లక్షా 50 రూపాయల లోపు ఆదాయం, పట్టణ ప్రాంతాల వారైతే 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

1614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles