బీమా సంస్థలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Tue,December 3, 2019 09:57 PM

హైదరాబాద్ : జీవిత బీమా సంస్థలో అసిస్టెంటు ఉద్యోగాల నియామకాలకు ఉద్దేశించిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్(ఐసీఈయు) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆదీశ్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఈనెల ఆరు నుంచి 20వ తేదీవరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు దోమలగూడలోని ఎన్‌టీఆర్ స్టేడియం ఎదురుగా, చెన్నుపాటి భవన్‌లోని టీఎస్‌యుటీఎఫ్ కార్యాలయంలో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. వివరాలకు 040-23420701 ఫోన్ నెంబరుపై సంప్రదించవచ్చు

337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles