మైనార్టీలకు ఉచితంగా సివిల్స్ కోచింగ్

Tue,August 20, 2019 07:40 AM

Free civil coaching for minorities

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ అభ్యర్థులకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచింగా కోచింగ్ ఇవ్వడానికి తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖ ముందుకువచ్చింది. అందుకు సంబంధించి సోమవారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సలహాదారు ఏకే ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 100 మంది మైనార్టీ అభ్యర్థులను ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సంస్థలు అనలాగ్, బ్రెయిన్‌ట్రీ, ఆర్సీరెడ్డి, విజన్ ఐఏఎస్ సంస్థల్లో కోచింగ్ తీసుకోవడానికి అభ్యర్థులకు అవకాశమిచ్చారు. అందుకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని, పైగా స్కాలర్‌షిప్ కూడా అందిస్తామని మైనార్టీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖ డైరెక్టర్ షానవాజ్‌ఖాసీం మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్న తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ సెక్రటరీ బీ షఫీవుల్లాఖాన్ మాట్లాడుతూ.. మైనార్టీ అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికైతే తిరిగి ఆ వర్గం సంక్షేమానికి బాగా పనిచేసే అవకాశం ఉంటుందని అన్నారు.

801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles