ఎస్సీలకు ఏయిర్‌స్పేస్ కోర్సులో ఎస్సీ కార్పొరేషన్ ఉచిత శిక్షణ

Thu,June 13, 2019 09:09 AM

హైదరాబాద్ : పేద కుటుంబాలకు చెందిన ఎస్సీలకు ఏయిర్‌స్పేస్ కోర్సులో ఎస్సీ కార్పొరేషన్ ఉచిత శిక్షణనిప్పిస్తున్నది. బీటెక్ ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సు పూర్తి చేసిన వారికి ఏయిరోస్పేస్ టెక్నికల్ పబ్లికేషన్ అండ్ స్ట్రక్చురల్ డిజైన్ కోర్సులో శిక్షణ నిప్పిస్తున్నారు. మొదటి మూడు మాసాలు శిక్షణ, చివరి మూడు మాసాలు అప్రెంటీస్ ఉంటుంది. అభ్యర్థులకు శిక్షణ కాలంలో మూడు నెలల పాటు నెలకు రూ. 5 వేల చొప్పున స్టైఫండ్‌గా ఇస్తారు. శిక్షణ ముగియగానే పీ3 అకాడమీ వారే చొరవ తీసుకుని ప్లేస్‌మెంట్ కల్పిస్తారు.


జూన్ మూడు నుంచి బెంగళూరులో మొదటి బ్యాచ్ ప్రారంభం కాగా, ప్రస్తుతానికి 50 మందికి ప్రవేశం కల్పించారు. మొత్తం 100 మందిని ఎంపిక చేయగా, వారిలో నుంచి 50 మందికి శిక్షణ నిప్పిస్తున్నారు. రూ. 1. 10 లక్షల విలువైన కోర్సు ఉచితంగా నేర్పిస్తుండటం, అది ప్రతి ష్టాత్మకమైన శిక్షణా సంస్థలో కావడం గమ నార్హం. పీ3 సంస్థ జర్మన్ మల్టీనేషన్ కంపెనీ కావడం, 33 దేశాల భాగస్వామ్యంతో నడుస్తుండటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు శిక్షణ కోసం ఈ సంస్థను ఎంపికచేసి, శిక్షణనందిస్తున్నారు. మొదటి విడత శిక్షణ ముగియగానే ఫలితాలను బట్టి, శిక్షణను కొనసాగిస్తామని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles