అమెరికా ఆర్మీలో పనిచేస్తున్నానంటూ బురిడీ

Tue,April 23, 2019 07:32 AM

fraud working in American Army

హైదరాబాద్ : చాటింగ్‌లో ఆమెలాగా నటించి.. భారీగా డాలర్లను పార్శిల్ పంపిస్తున్నానంటూ నమ్మించి నగరానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన నైజీరియన్ యువకుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలో ఈ నైజీరియన్‌ను పట్టుకోని నగరానికి తీసుకువచ్చారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం ప్రకా రం.. నైజీరియా దేశానికి చెందిన నవాంబ రైమాండ్ ఇఫ్నెయి ఉత్తర్‌ప్రదేశ్ పుణేలో నివాసముంటున్నాడు. ఇతనికి సోషల్‌మీడియాలో వివిధ పేర్లతో ఖాతాలు ఉన్నాయి. ఇలా ఫేస్‌బుక్‌లో సోల్జర్‌లో పనిచేసే మహిళ ఫొటో పెట్టి, నగరానికి చెందిన ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంది. తాను అమెరికా ఆర్మీలో పనిచేస్తున్నానని, ఆర్మీలో పనిచేస్తుండడంతో తన వద్ద భారీగా డాలర్లు ఉన్నాయని, వాటిని ఇక్కడ ఏమి చేయాలనేనంటూ నమ్మించింది.

కొన్ని రోజుల తరువాత తన వద్ద ఉన్న భారీ డాలర్లను మీకు పంపిస్తాను, ఇండియాకు నేను వచ్చి వాటిని తీసుకుంటాను, వాటిని భద్రంగా దాచిపెట్టు, ఇందుకు ప్రతిఫలంగా 30 శాతం నీకు ఇచ్చేస్తానంటూ నమ్మించింది. నిజమేనని నమ్మిన బాధితుడి వద్ద ఉన్న చిరునామా తీసుకుం ది. జనవరి 30న ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుపై వచ్చిన పార్శిల్ ఒకటి ఇక్కడ ఆగిపోయిందని, దానికి రూ. 30,500 కస్టమ్స్ ఫీజు, యాంటీ టెర్రరిజమ్ సర్టిఫికెట్ కోసం రూ. 75,000 ఇలా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పై రెండు ఫీజులు చెల్లించిన తరువాత ఇంకా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బు చెల్లించకపోతే ముంబై పోలీసులు మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారని బెదిరించారు. దీంతో బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిందితుడు ఆడ కాదు.. మగ వ్యక్తే అని దర్యాప్తులో తేలింది.

సోషల్‌మీడియాలో ఉన్న వివిధ ఖాతాల తో అవసరాన్ని బట్టి మహిళలు, పురుషులుగా నటిస్తూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. నిందితుడి ఆధారాలు సేకరించిన సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ బృందం పుణేలో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్ని స్తున్న క్రమంలో నైజీరియన్ తప్పించుకునే ప్ర యత్నం చేశాడు. పోలీసులు అతన్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు.

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles